Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా సీన్లను తలపించేలా.. పెళ్లి కూతురి మెడలోంచి తాళిబొట్టు కొట్టేసిన దొంగలు

  • కామారెడ్డి జిల్లాలో ఘటన
  • హైదరాబాద్‌ నుంచి వచ్చిన దొంగలు
  • వధువు మెడలో దండ సర్దుతూ చోరీ
  • కారులో పారిపోతుండగా పట్టుకున్న బంధువులు
సినిమా సీన్లను తలపించేలా కొందరు పెళ్లి కూతురి మెడలో నుంచి తాళిబొట్టును కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చి, దగ్గరి బంధువుల్లా నటించి, అందరినీ మభ్యపెట్టి అక్కడి నుంచి జంప్‌ అయిపోయి, చివరకు పెళ్లికూతురి బంధువులకి పట్టుబడ్డారు కొందరు దొంగలు. పూర్తి వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలో ఓ పెళ్లి జరుగుతోంది.

హైదరాబాద్‌ నుంచి ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్‌ ఆ వివాహవేడుకకు వచ్చారు. బంధువుల్లా అందరినీ పలకరిస్తూ అన్ని పనులు తామే చేస్తున్నట్లు పోజులుకొట్టారు. చివరకు వధువు మెడలో దండ సర్దుతూ తాళిబొట్టు చోరీ చేశారు. కొద్ది సేపటికి విషయాన్ని గుర్తించి పెళ్లి కూతురు చెప్పడంతో బంధువులంతా కలిసి దొంగలను పట్టుకోవడానికి పరుగులు తీశారు. కారులో పరారవుతున్న దొంగలను ఎట్టకేలకు తమ గ్రామంలోనే ఓ చోట పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
robbery
Kamareddy District
bride

More Telugu News